ఆంధ్రప్రదేశ్ లో ఈ- సిగరెట్లను నిషేదించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హెచ్చరికలు జారి చేసారు. 1940 డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం లైసెన్స్ పొందిన వారు మాత్రమే అమ్ముకోవాలని ఆయన తెలిపారు. అలా కాదని దొంగతనంగా ఏదైనా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీటికి సంబంధించి ఎగుమతి, దిగుమతి, అమ్మకాలు వంటివి నిషేధించామని, దీనిపై ఎటువంటి ప్రచారాలు కూడా ఇకనుండి జరగవని. ఒకేవేల రూల్స్ ని అతిక్రమిస్తే 2లక్షలు జరిమానా లేదు సంవత్సరం జైలు శిక్ష, రెండోసారి కూడా దొరికితే మూడేళ్ళు జైలు లేదా ఐదు లక్షలు జరిమానా విదిస్తారని అన్నారు. నిల్వ సరకు ఏదైనా ఉంటే ఇప్పుడే అప్పగించండి లేదంటే కటిన చర్యలు తీసుకుంటామని డీజీపీ అన్నారు.