2014 ఎన్నికల్లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను నమ్మించి చివరికి గెలిచిన తరువాత వారిని కష్టాల్లో పడేసాడు. రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ప్రభుత్వం పేరు చెప్పుకొని అందరు సొంత పనులు చేసుకున్నారు తప్పా, ప్రజలకు చేసింది ఏమి లేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “రుణమాఫీ హామీతోనే కిందటి ఎన్నికల్లో పచ్చపార్టీ గెలిచింది. ఇంకా 7,582 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా అకౌంట్లలో జమ చేసినట్టు ఎన్నికల ముందు కుల మీడియాతో రాయించారు. ఇప్పుడా మాఫీ సొమ్మును ఇవ్వకుండా రైతులను వేధిస్తారా అని యనమల గారు సొల్లు వాదన చేస్తున్నారని అన్నారు.