Home / ANDHRAPRADESH / చంద్రబాబును ఆ భయం వణికిస్తుందా..అందుకేనా ఓలెక్ట్రా బస్సులపై పచ్చ మీడియా పిచ్చి ఆరోపణలు…!

చంద్రబాబును ఆ భయం వణికిస్తుందా..అందుకేనా ఓలెక్ట్రా బస్సులపై పచ్చ మీడియా పిచ్చి ఆరోపణలు…!

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చంద్రబాబు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు..రాజధాని డ్రామా, పల్నాటి డ్రామా, కోడెల ఆత్మహత్య డ్రామా, గ్రామవాలంటీర్ల పరీక్షా పేపర్ లీక్ డ్రామా..ఇలా వరుసగా ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఎన్ని డ్రామాలు ఫెయిలైనా ఎల్లోమీడియాతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లడం మాత్రం చంద్రబాబు ఆపడం లేదు. తాజాగా రివర్సె టెండరింగ్‌తో ప్రభుత్వానికి 743 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనుల్లో జరిగిన అవినీతి లెక్కలు బయటపడనున్నాయి. దీంతో ఆందోళన పడిన చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ..ఈ రివర్స్ టెండరింగ్‌‌లో క్విడ్‌ఫ్రోకో జరిగిందని, తక్కువ కోట్ చేసిన మేఘా సంస్థకు రూ. 7 వేల కోట్ల రూపాయల లబ్ది చేకూరుస్తుందంటూ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. బాబుగారికి కొమ్ము కాసే ఎల్లోమీడియా క్విడ్‌ఫ్రోకో అంటూ పిచ్చి రాతలు, వెర్రి కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

అసలు ఏడాదికి రూ. 144 కోట్ల బడ్జెట్‌తో రూ.ఏడు వేల కోట్ల కుంభకోణం చేయోచ్చని అర్ధశాస్త్రంలో ఎంఫిల్ మధ్యలోనే ఆపేసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాగా లెక్కలు వేశారు. బోడిగుండుకు మోకాలుకు ముడివేసినట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తక్కువ ధరకు మేఘా ఇంజనీరింగ్ టెండర్ దాఖలు చేసింది కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఒలెక్ట్రా నుంచి ఎలక్ట్రిక్ బస్సులులను కొనుగోలు చేసి అనుచిత లబ్ధి చేకూర్చాలనే గ్లోబల్(గోబెల్స్ ప్రచారం. దీన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు అలా పలుకుతారు) ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేంద్రం దేశంలోని 29 రాష్ట్రాలకు ఈ ఏడాది కేటాయించిన రూ. 3545 కోట్లు కేటాయిస్తే అందులో మన రాష్ట్రానికి దక్కిన వాటా రూ. 144 కోట్లు. మూడు సంవత్సరాల్లో కేంద్రం ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు, అద్దెకుతీసుకునేందుకు కేటాయించిన మొత్తం రూ.10 వేల కోట్లు. ఏ లెక్కన చూసినా చంద్రబాబు చెప్పినంత కేటాయింపు ఏపీకి రాలేదు. రావు కూడా.

ఏదైనా ఒక సంస్థను భ్రష్టు పట్టించాలంటే దానిపై విష ప్రచారం చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట. తాను అధికారంలో ఉన్నపుడు పలు సంస్థలను ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చిది అని విష ప్రచారం చేసి సంహరించినట్లు ఎక్కడికక్కడ వాటిని మూసివేశారు. తెగనమ్మారు. ఇపుడు కూడా అలాంటి ప్రచారం ద్వారా జరగరానిది ఏదో జరిగిపోతున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు, పార్టీ నేతలు, ఆ అయన అనుచరగణమైన ఎల్లోమీడియా.

కేంద్రం ఈ ఏడాది ఫేమ్ 2 పథకం కింద రూ. 3545 కోట్లు కేటాయించి అందులో 350 బస్సులు ఆర్టీసీ అద్దెకు తీసుకునేందుకు అనుమతిచ్చింది. ఆర్టీసీ బస్సులును అద్దెకు తీసుకోవటంతో పాటు, రూట్లను ఎంపిక చేయాలన్నా కేంద్రం మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించాలి. వాటిని ఉల్లంఘిస్తే భవిష్యత్లో ఈ పథకం కింద నిధులు కేటాయించిపు నిలిపివేసే ప్రమాదం లేకపోలేదు. ఈ పథకం కింద కేంద్రం నిబంధనలు ఇంత కఠినంగా ఉంటే చంద్రబాబు అండ్ కో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మేఘా కంపెనీకి ఏదో అనుచిత లబ్ధి చేకూరుస్తోందని బిల్డప్ ఇచ్చి పోలవరం విషయంలో తాను చేసిన అవినీతిని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు.

2014లో అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును తనకు సన్నిహితంగా ఉండే కాంట్రాక్టు సంస్థకు అధిక రేటుకు చంద్రబాబు కట్టుబెట్టారు. జల విద్యుత్ కేంద్రం నిర్మాణం కూడా అదే సంస్థకు ఇచ్చారు. నిబంధనల ప్రకారం మరో రెండు నెలల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావాలి. కానీ తట్టెడు మట్టి కూడా జల విద్యుత్ కేంద్రం నిర్మాణానానికి తీయలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కాంట్రాక్టులన్నింటిపై ఉన్నతస్థాయి కమిటీని విచారణకు ఆదేశించింది. ఆ కమిటీ చంద్రబాబు ప్రభుత్వం పోలవరం విషయంలో రూ. 2500 కోట్ల అవినీతికి పాల్పడిందని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. అదే సమయంలో పోలవరం ప్రస్తుత కాంట్రాక్టు సంస్థను తొలగించటం లేదా కొనసాగించటంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరింది. దీంతో ప్రభుత్వం టెండర్ పిలిచింది.

కాళేశ్వరం వంటి మెగా ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించిన మేఘా యాజమాన్యం ఏపీలో కూడా అదే తరహాలో ప్రాజెక్టును నిర్మిద్దామనే ఉద్ధేశ్యంతో తక్కువ ధరకు టెండర్ వేసింది. జల విద్యుత్ కేంద్రం, పోలవరం డ్యాం మొదలైనవి కలిపి రూ. 628 కోట్ల తక్కువ ధరకు నిర్మిస్తామని తెలిపింది. పోలవరం విషయంలో చంద్రబాబు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీడీపీ నేతలు పోలవరంను ఏటీఎం మాదిరిగా వాడుకుంటున్నారని సాక్షాత్తూ ప్రధాని ఆరోపించారు. 2018 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్న చంద్రబాబు మాట నిబెట్టుకోలేకపోయారు. ఇదే సమయంలో మేఘా సంస్థ తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసింది.

ఇక ఫేమ్ పథకం కింద అనుబంధ ఒలెక్ట్రా సంస్థ నుంచి ఆర్టీసీ రూ. 144 కోట్ల పూర్తి బడ్జెట‌్‌ను కేటాయించి ఎలక్ట్రిక్ బస్సులు అద్దెకు తీసుకుంటుందని రూ. 628 కోట్లు నష్టపోయేందుకు ఎవరైనా పనిచేస్తారా అనేది ఆర్ధికశాస్త్రంలో ఎంఏ పూర్తిచేసిన చంద్రబాబుకు తెలియదు అనుకోవాలా.
ఫేమ్ 2 కింద ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ తదితర రాష్ట్రాల బస్సులును అద్దెకు నడుపుతున్నాయి. గత ఏడాది మార్చిలో చంద్రబాబు ఒలెక్ట్రా సంస్థ బస్సులల్లో విహరించి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరపున వాటిని కొనుగోలు చేస్తామని వెల్లడించారు. తిరుపతి, తిరుమల మధ్య వాటినే తిప్పుతామని ప్రకటించారు.

అధికారం పోయిన వెంటనే గతంలో చెప్పిన మాటను మర్చిపోయిన చంద్రబాబు క్విడ్ ప్రో కోను తెరపైకి తెచ్చి గత కొద్ది రోజులుగా లేనిపోని హాడావిడి చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులును అద్దెకు తీసుకునే ప్రక్రియలో భాగంగా గురువారం ఆర్టీసీ ఎండీ ప్రి బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 18 సంస్థల నుంచి 27 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ సంస్థల్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్తో పాటు అశోక్ లేలాండ్, ఫోటాన్, ఓజీఎల్ తదితర సంస్థలున్నాయి. ఆర్టీసీ బిడ్లు ఆహ్వానించిన తరువాత పలు సంస్థలు దాఖలు చేస్తాయి. ఏడాదికి 3.98 కోట్ల కిలోమీటర్లు ఈ బస్సులు రాష్ట్రంలో తిరగాలి. అన్ని రూట్లు చంద్రబాబు ఆరోపిస్తున్న సంస్థకు వస్తాయన్న గ్యారంటీ లేదు. ఎవరు తక్కువ ధరకు బిడ్ వేస్తే వారికి దక్కుతాయి. అలాంటపుడు రూ. 144 కోట్లు కూడా ఆ సంస్థకు రావు. మరి రూ. 7500 కోట్లు ఎక్కడి నుంచి ఒలెక్ట్రాకు క్విడ్ ప్రో కో కింద చెల్లిస్తున్నారో , చంద్రబాబు అండ్ కో ఎందుకు ఈ అరోపణలు చేస్తుందో వారికే తెలియాలి.

ఒకవేళ చంద్రబాబు చెప్పినట్లు రూ. 144 కోట్లు ఏడాదికి వచ్చినా అది వ్యాపారం అవుతుంది. ఒలెక్ట్రా సంస్థలో మేఘాకు మెజారిటీ వాటాలున్నాయి తప్ప పూర్తిగా వ్యాపారానికి ఆ కంపెనీకి సంబంధం ఉండదు. కేంద్రం ప్రకటించిన రూ. 3545 కోట్లతో 5595 బస్సులును దేశ వ్యాప్తంగా కొనుగోలు చేయాలి. ఎత్తైన ,కొండ ప్రాంతాల్లో ఒలెక్ట్రా బస్సులు ఉత్తమమని ఇప్పటికే నిరూపితమైంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు అపుడే మేఘాకు వచ్చినట్లు చంద్రబాబు బృందం ప్రచారం చేస్తోంది. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. కోర్టులో నెలకొన్న వివాదం తేలితేనే పోలవరం నిర్మాణం విషయంలో ముందడుగు పడుతుంది. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో తాను చేసిన తప్పులు రుజువయ్యే పరిస్థితి నెలకొనడంతో రకరకాల ఆరోపణలను చంద్రబాబు గుప్పిస్తున్నారనేది వాస్తవమనే భావన అందరిలో వ్యక్తం అవుతోంది.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat