యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద నిలిచింది. అది కూడా ఒక్క నార్త్ లోనే ఈ చిత్రం ఊపు అందుకుంది. మిగతా అన్ని చోట్ల పడిపోయింది. అయితే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న తరువాత చిత్రం జాన్. సాహో ఫ్లాప్ ని దృష్టిలో పెట్టుకున్న ప్రభాస్ దీనిపై ఒక కన్ను వేసాడు. దాంతో ప్రభాస్ కోరిక మేరకు ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ చివరికి వాయిదా పడింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ డెసిషన్ వల్ల ప్రభాస్ , అక్కినేని అఖిల్ కి పెద్ద సాయం చేసినట్టే. ఎందుకంటే జాన్ లో ప్రభాస్ కు జంటగా పూజా నటిస్తుంది. అదే సమయంలో అఖిల్ కి జంటగా కూడా పూజానే అనుకున్నారు. కాని ఆమెకు డేట్స్ కాలి లేకపోవడంతో దూరంగా ఉంది. కాని ఇప్పుడు జాన్ కు గ్యాప్ రావడంతో ఇందులో అఖిల్ తో నటించనుంది.