వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాష్ట్ర రాష్ట్ర ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన పాదయాత్రలో ప్రముఖంగా ప్రస్తావించిన అంశం విద్యార్థులు చదువు.. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ ఎక్కువగా విద్యపై దృష్టి పెట్టారు. విద్యతోనే వారి జీవితాల్లో పేదల బతుకుల్లో మార్పు వస్తుందని అదే అభివృద్ధి అంటూ జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో అమ్మ ఒడి, పూర్తి స్థాయి రీయింబర్స్మెంట్ పథకాలకు శ్రీకారం చుట్టారు. అయితే ఉద్యోగాల పరంగా జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మాస్ కాపీయింగ్ అరికట్టడానికి పదవ తరగతి ప్రశ్నా పత్రంలో బిట్ పేపర్ తొలగించాలంటూ మంత్రి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జగన్ ఆదేశాలతో, విద్యావేత్తల సూచనలతో నిర్ణయించినట్టు తెలుస్తోంది..
విద్యా ప్రమాణాలు పెంచడానికి ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రైవేట్ స్కూల్లో అమలు చేయాలని సురేష్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి స్కూల్లో తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటయ్యాయని ఫీజుల నియంత్రణ కు ఈకమిటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ విద్యావ్యవస్థలో కాపీ అరికట్టి విద్యా ప్రమాణాలు పెంచడానికి అనేకచర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్య పరంగా సీఎం తీసుకున్న సంఘం సంస్కరణల పట్ల విద్యావేత్తలు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.