అదేంటి డ్రింక్స్ తాగితే చెయ్యి కుళ్ళిపోవడం ఏమిటి అనుకుంటున్నారా. అవునండి అది నిజమే అదేపనిగా కూల్ డ్రింక్స్ తాగితే కచితంగా చెయ్యి కుల్లుతుంది. అది ఎలాగా అనేది ఇప్పుడు మీకు పూర్తి వివరణ ఇస్తాను. ఇప్పుడు చెప్పే ఉదాహరణ మలేసియా రాజధాని ఐన కౌలాలంపూర్ లో జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తికి పేరు రజీన్ డ్రింక్స్ మీద ప్రీతీ చాలా ఎక్కువే. బోజనమైన చెయ్యడం మానేస్తాడు గాని డ్రింక్స్ తాగకుండా ఉండలేదు. ఇంకా చెప్పాలంటే తను ఆహారం తినకుండా డ్రింక్స్ తాగే బ్రతికేస్తాడు. అలా కొద్దిరోజులకి ఆయనకీ చెయ్యి నొప్పిగా ఉందని అనిపించి డాక్టర్ కి చూపించుకున్నాడు. అప్పుడు చెకప్ లో అతడికి డయాబెటిస్ ఉందని తేల్చి చెప్పారు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వలనే ఇలా అయ్యిందని చెప్పారు. అయినప్పటికీ అతడు డ్రింక్స్ తాగడం మానలేదు. కొన్ని రోజులకి ఆ నొప్పి ఇంకా ఎక్కువ అవ్వడంతో హాస్పిటల్ లో చుపించుకోగా డాక్టర్లు మీ చెయ్యి శరీరం నుండి వేరయ్యేలా ఉందని, ఇప్పటివరకు చూపించుకోకుండా ఏం చేస్తున్నావని అన్నారు. తన చర్మం వెనకభాగం మొత్తం కుల్లిపోయింది. దాంతో కుళ్ళిన భాగంలో చీముని తొలిగించి ఇంకెప్పుడు తీపి అనిపించే దేనిని ముట్టుకోవద్దని సలహా ఇవ్వడం జరిగింది.