తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. తమిళనాడులోని ప్రముఖ నటులైన కమల్హాసన్ రజనీకాంత్ ఉద్దేశించి రాజకీయపరంగా చిరంజీవి పలు వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరూ రాజకీయాల్లోకి రాక పోవడమే మంచిది అంటూ తన అభిప్రాయం చెప్పారు చిరంజీవి. ఈ సందర్భంగా తనకు రాజకీయంగా ఎదురైన చేదు అనుభవాలను తాజాగా సైరా ప్రమోషన్లో భాగంగా పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా ఉన్న తాను రాజకీయాల్లోకి వెళ్లానని కానీ తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయానని ఒప్పుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కు కూడా ఇలాగే జరిగిందన్నారు. డబ్బులతో ఓడించారని చిరంజీవి వ్యాఖ్యానించారు. అయితే ఓటమి ఎదురైనా సరే రాజకీయ ఉండాలనుకుంటే రాజకీయాల్లోకి రావాలని లేకుంటే రాజకీయాల్లోకి రాకపోవడం మంచిదని చిరు సలహా ఇచ్చారు. అంతేకానీ తాను, పవన్ ప్రజాభిమానాన్ని ఓట్ల రూపంలో పొందలేకపోయామని, ప్రజలు తమను నమ్మలేదని చిరంజీవి ఒప్పుకోలేదు.