ఇలియానా… 2006లో వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఈ చిత్రంలో రామ్ పోతినేని సరసన నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తన మొదటి సినిమాతో ఇలియానా ఫేమస్ అయ్యింది. అనంతరం అవకాశాలు తన దగ్గరకు ఎతుక్కుంటూ వచ్చాయి. అలా కొంతకాలం టాలీవుడ్ లో ఇలియానా హవానే నడిచింది. ఆ తర్వాత కొంతకాలానికి కొత్త హీరోయిన్లు రావడంతో ఈ ముద్దుగుమ్మ వెనకబడింది. అలా అవకాశాలు మొత్తం కోల్పోయిందనే చెప్పాలి. అప్పట్లో పోకిరి సినిమాలో కుర్రకారుకు పిచ్చేకించింది. ఇప్పుడు ఆమెను పట్టించుకునే నాదుడే లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఇండస్ట్రీ లో యంగ్ హీరోయిన్ల హవా నడుస్తుంది. కాబట్టి ఇలియానా పరిస్థితి ఏమిటో తనకే అర్ధంకాని స్థితిలో ఉంది.
