రాజమౌళి సినిమాలకు జనాల్లో ఉన్న క్రేజ్ మాములు క్రేజ్ కాదు ఆ విషయం అందరికి తెలిసిందే. అతని డైరెక్షన్ లో వచ్చే సినిమాలకు జనాలు ఎగబడి ఎదురు చూస్తుంటారు. అలాంటి జక్కన్న ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే ఇంకేలా ఉంటుంది. అభిమానులకు మైండ్ పోతుంది. సరిగ్గా అదే జరుగుతుంది. త్రిబుల్ ఆర్ గురించి ఏ చిన్న న్యూస్ బయటకి వచ్చినా… జనాలు ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. తాజాగా రాజమౌళి, ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. వారిద్దరు కలిసి తీసిన స్టూడెంట్ నెం1 సినిమా ఈ రోజు రిలీజ్ అయిందని చెప్పిన రాజమౌళి, ఎన్టీఆర్ సరిగ్గా ఇదే రోజు ఇద్దరు అదే రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండటం గమ్మత్తుగా ఉందని గుర్తు చేసుకున్నారు. రాజమౌళి నేను ఇక్కడే షూటింగ్ చేశామని ఎన్టీఆర్ పెడితే… రాజమౌళి ఓ ఫోటో పెట్టి ఎదుగుతూ సన్నగా అవుతూ ఎన్టీఆర్ పెరిగారని, నేను కాస్త ముసలి వాడిని అయ్యానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలపై చర్చ జరుగుతుంది.
