టిక్ టాక్ అనే సోషల్ మీడియా యాప్ తో చాలామంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తాము కష్టపడి సంపాదించిన ఉద్యోగాలను కూడా టిక్ టాక్ వల్ల కోల్పోతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు టిట్ టాక్ మోజులో పడి మృతి చెందాడు… ఈ ఘటన స్థానికులను కలచివేసింది. తెలంగాణలోని భీంగల్ మండలం గోను గొప్పుల గ్రామానికి చెందిన యువకులు గ్రామ శివారులోని కప్పుల వాగు చెక్ డ్యామ్ వద్ద టిక్ టాక్ చేస్తుండగా దినేష్ అనే యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీన్ని గమనించిన స్నేహితులు అతనిని రక్షించేందుకు ప్రయత్నం చేసినా కాపాడలేకపోయారు. దినేష్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టగా రెండ్రోజుల తర్వాత అతని మృతదేహం లభించింది. ఇలా టిక్ టాక్ లు చేస్తూ ప్రాణాలను కోల్పోతుంటే వారిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాగే చాలామంది స్టూడెంట్లు, డాక్టర్లు, పోలీసులు టిక్ టాక్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. విధులను మరిచి కొందరు, చదువును మరిచి మరి కొందరు పోటీ పడుతూ టిక్ టాక్ చేస్తున్నారు. ఇలా ఎందరో యువకుల ప్రాణాలు పోవడానికి, చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడటానికి ఇది కారణమైంది. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లో అర్పితా అనే మహిళా పోలీసు బాలీవుడ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి సస్పెన్షన్‌కు గురైంది. అలాగే
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అడవిలోకి మురళి అనే యువకుడు వెళ్లి టిక్ టాక్ చేశాక అడవి నుంచి ఎలా బయటకు రావాలో అతనికి అర్థం కాలేదు. దారి తప్పి ఇబ్బందులు పడ్డాడు. చివరకు తన వాట్సాప్ ద్వారా స్నేహితులకు లొకేషన్ షేర్ చేసి పోలీసుల సాయంతో బయటపడ్డాడు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రిలో ఇద్దరు జూనియర్ డాక్టర్లు కూడా ఇదే మోజులో పడి ఇంటిదారి పట్టారు. విశాఖలో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్ వంటి శక్తి టీమ్ కూడా టిక్ టాక్ కు బానిసై యూనిఫామ్ ఉందన్న విషయాన్ని కూడా మరిచి ఇద్దరు టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఎంజాయ్ చేసారు.
ఇలా నిత్యం
టిక్ టాక్ మోజులో పడి అడవిపాలైన విద్యార్థి..
టిక్‌టాక్ మోజులో పడిన వివాహిత.. భర్త తిట్టాడని ఆత్మహత్య..
టిక్‌టాక్ మోజులో విశాఖ ‘శక్తి టీమ్’ పోలీసులు… ఉన్నతాధికారుల
టిక్‌టాక్ ట్విస్ట్.. ఆసుపత్రిలో నర్సులు చిందులు, సర్కారు సీరియస్..
ప్రాణాల మీదకు తెచ్చిన టిక్ టాక్..
టిక్‌టాక్ ఫ్రెండ్‌తో పరారైన వివాహిత.. లబోదిబోమంటున్న భర్త..
ప్రాణం తీసిన టిక్ టాక్ సరదా.. యువకుడి మృతి..
అంటూ ఎన్నివార్తలు వస్తున్నా వీళ్లు మాత్రం మారట్లేదు. దీనంతటికి ఒకటే కారణం సైకాలజిస్టులు చెప్తున్నారు. ఎదుటివారు తమను గుర్తించాలి, నాలో టాలెంట్ ఉంది.. నేను అందంగా ఉన్నాను. నాకు ఫాలోయింగ్ ఉంది.. నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. నన్ను ఎంకరేజ్ చేస్తే ఎక్కడికో వెళ్లిపోతా.. వంటి అనేక కారణాలు, అపోహలతో ఇలాంటి టిక్ టాక్ లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.