తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ దివంగత ముఖ్యమంత్రి,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు పిలుపుతో కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీ కండువా కప్పుకుని 1985లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్వీఎల్ నరసింహారావు కన్నుమూశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన పలు ఉద్యమాలు,పోరటాలకు అండగా నిలిచిన నరసింహారావు 1995లో ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు చేసి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కు అండగా నిలిచారు .
కొన్నెండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు. 1933 జూన్ ఒకటిన ఆయన జన్మించారు. 1970 దశకంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.