Home / ANDHRAPRADESH / శ్రీ సాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి తెలంగాణ ధర్మ ప్రచారయాత్ర వివరాలు ఇవే…!

శ్రీ సాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి తెలంగాణ ధర్మ ప్రచారయాత్ర వివరాలు ఇవే…!

సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో ఇవాళ విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు తొలిసారిగా సెప్టెంబర్ 28 నుంచి తెలంగాణ ధర్మ ప్రచార యాత్ర చేపడుతున్నారు.
ఈ యాత్రలో భాగంగా తొలుత ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి పర్యటిస్తారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 8 వరకు వరంగల్ జిల్లాలోని పలు దేవాలయాలను స్వామిజీ సందర్శిస్తారు. అలాగే వరంగల్ నగరంలో కెప్టెన్ లక్ష్మీకాంత రావు స్వగృహంలో దేవి నవరాత్రుల కార్యక్రమంలో స్వామిజీ పాల్గొంటారు. అక్టోబర్ 9 నుంచి వరుసగా కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, అదిలాబాద్ జిల్లాలోని పలు దేవాలయాలను శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సందర్శిస్తారు. ఈ యాత్రలో సనాతన వైదిక ధర్మ విశిష్టతను, హిందూజాతి ఔన్యత్యాన్ని చాటేలా స్వామివారు భక్తులకు అనుగ్రహ భాషణం ఇస్తారు. సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమయ్యే తొలివిడత తెలంగాణ ధర్మ ప్రచార యాత్ర అక్టోబర్ 25 న ముగుస్తుంది. తెలంగాణ ధర్మ ప్రచార యాత్ర ప్రారంభం కానున్న సందర్భంగా ఈ రోజు సింహాచలంలో విశాఖ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి మరియు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాధికారి హోదాలో స్వాత్మానందేంద్ర సరస్వతి తొలిసారిగా చేపడుతున్న తెలంగాణ ధర్మ ప్రచార యాత్ర విజయవంతం కావాలని ఇరువురు స్వామిజీలు సింహాచల అప్పన్నస్వామిని వేడుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి తెలంగాణ ధర్మ ప్రచార యాత్రకు సంబంధించిన వివరాలను విశాఖ శ్రీ శారదాపీఠం ప్రకటించింది. కాగా స్వామిజీల రాకతో సింహాచలంలో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. పలువురు ప్రముఖులు, భక్తులు స్వామిజీల ఆశీస్సులు తీసుకున్నారు.

 

 విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి

శ్రీ శ్రీ శ్రీ  స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి                     

   తెలంగాణ ధర్మ ప్రచార యాత్ర               
ఉమ్మడి వరంగల్ జిల్లా                                              

28-09-2019   నుంచి   08-10-2019      

దేవాలయాల సందర్శన

* వేయి స్థంభాల గుడి *  భద్రకాళీ ఆలయం   *  పద్మాక్ష్మీ దేవాలయం *   రామప్పగుడి

 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా             

( 09-10-2019   నుంచి 12-10-2019)

* అక్టోబర్ 9 ఉదయం  కరీంనగర్‌కు స్వామివారి ఆగమనం

* రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ    * ఆంజనేయ స్వామి ఆలయం,  కొండగట్టు
* శ్రీ కాశేశ్శర ముక్తేశ్వర దేవాలయం, కాళేశ్వరం

గమనిక : 12-10-2019 సాయంత్రం ఖమ్మంకు స్వామివారి పయనం

 ఉమ్మడి ఖమ్మం జిల్లా

(  13-10-2019 నుంచి 17-10-2019 )

* శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, భద్రాచలం

*  పర్ణశాల, భద్రాచలం* వేంకటేశ్వరస్వామి దేవస్థానం, జమలాపురం

* గణపేశ్వరాలయం,  కూసుమంచి

గమనిక : 17-10-2019 రాత్రి నిజామాబాద్‌కు స్వామివారి పయనం

 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా                        

18-10-2019 నుంచి 20-10-2019 

* శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం, నిజామాబాద్.

* చక్రేశ్వర ఆలయం, బోధన్
* బసవ లింగప్ప గుడి, బిచ్కుంద

గమనిక : 20-10-2019  రాత్రి హైదరాబాద్‌కు స్వామివారి పయనం

హైదరాబాద్ 

 21-10-2019

* శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, చందానగర్

గమనిక : 21-10-2019 రాత్రి అదిలాబాద్‌కు స్వామివారి పయనం

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా   

( 22-10-2019 నుంచి 25-10-2019)

* శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్రం,  బాసర
* అగస్వేశ్వర ఆలయం, చెన్నూరు
*  మల్లన్నదేవాలయం, సిరిచెల్మ

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat