యుపీఏ హయాంలో మోదీ, అమిత్‌షాలను హత్య చేసేందుకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు కుట్ర చేశారంటూ..ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లలో సోనియా, రాహుల్‌లు తమ రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించేందుకు ప్రయత్నించేవారని, ఈ క్రమంలోనే నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని, ఆయనకు సన్నిహితుడైన అమిత్‌షాను హత్య చేసేందుకు కుట్ర చేశారంటూ..రాందేవ్‌బాబా ఆరోపించాడు. . బుధవారం యూపీలోని నోయిడాలో కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాం దేవ్ బాబా సోనియాగాంధీ, రాహుల్ గాంధీలే లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశాడు. తప్పుడు కేసుతో అమిత్‌షాను జైలులో పెట్టించిన రాహుల్‌గాంధీ ఆయన్ని జైలులోనే చంపించాలని చూశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గాంధీ కుటుంబ సభ్యులు తమ రాజకీయ ప్రత్యర్థులైన మోదీ, అమిత్‌షా అడ్డు తొలగించుకునేదుకు ప్రయత్నించారని, కానీ ఇప్పుడు మోదీ, అమిత్‌షా ఆ పని చేయడం లేదని..ఒకవేళ వాళ్లు కూడా అలా ప్రవర్తిస్తే రాహుల్, సోనియాల పరిస్థితి ఏంటని…రాందేవ్‌బాబా అన్నాడు. మొత్తంగా యుపీఏ హయాంలో మోదీ, అమిత్‌షాలను హతమార్చేందుకు సోనియా, రాహుల్‌గాంధీలు ప్రయత్నించారంటూ రాందేవ్‌బాబా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాందేవ్‌బాబా ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
