Home / TELANGANA / రామగుండం ఫర్టిలైజర్ ప్యాక్టరీ పున:ప్రారంభంపైన సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్

రామగుండం ఫర్టిలైజర్ ప్యాక్టరీ పున:ప్రారంభంపైన సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్

ప్రజలకిచ్చిన హామీ మేరకు రామగుండం ఎరువుల పరిశ్రమ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సాధ్యమైనంత త్వరగా ఫ్యాక్టరీని పునః ప్రారంభించడానికి కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీ పునరుద్ధరణ పనులపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పరిశ్రమల శాఖ అధికారులతో కలిసి ఎరువుల కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు. కంపెనీ పునరుద్ధరణకు సంబంధించిన కార్యకలాపాల వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.

రామగుండం ఎరువుల కంపెనీ పున:ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కేటీఆర్ కంపెనీ ప్రతినిధి బృందానికి తెలిపారు. కంపెనీని తిరిగి ప్రారంభించడానికి అవసరమైన అన్ని సహాయ సహాకారాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలకు హమీ ఇచ్చిన మేరకు కంపెనీ పునరుద్ధరణకు కృషి చేశామన్నారు. అందుకే, ఫ్యాక్టరీ పునరుద్ధరణలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష భాగసామ్యం తీసుకుందని వివరించారు. ఫ్యాక్టరీకి అవసరమైన ఉద్యోగాల కల్పనలో సాధ్యమైనంత మేర స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని కంపెనీ బృందాన్ని కేటీఆర్ కోరారు. తెలంగాణ అకాడమీ అఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ద్వారా యువకులకు ప్రభుత్వ ఖర్చులతో శిక్షణ ఇస్తామని, అందులోంచి ఉద్యోగులను ఎంపిక చేసుకోవాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా స్కిల్డ్, సెమీస్కిల్డ్ సిబ్బంది కోసం టాస్క్ ద్వారా ప్రత్యేక కోర్సులు తయారు చేసి, శిక్షణ ఇచ్చేందుకు సైతం సిద్దంగా ఉన్నామన్నారు. ఈ మేరకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో కలిసి పనిచేయాలని సమావేశానికి హాజరైన టాస్క్ ప్రతినిధులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీంతోపాటు అన్ స్కిల్డ్ కార్మికులను జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ ద్వారా భర్తీ చేసుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు.

రామగుండం ఎరువుల కంపెనీ పరిసరాల్లో గతంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈ సందర్భంగా కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఇందుకోసం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికి లేఖ రాస్తామని తెలిపారు. కంపెనీకి అవసరమైన రవాణ, హమాలీ వంటి అంశాల్లోనూ కంపెనీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఉపయోగించుకోవాలని మంత్రులు.. కంపెనీ ప్రతినిధి బృందాన్ని కోరారు. అటు మూతపడ్డ బిల్ట్ లాంటి కంపెనీలను తిరిగి ప్రారంభించేందుకు కూడా పరిశ్రమల శాఖ తరపున ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat