తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జాతీయ స్థాయిలో ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అందులో భాగంగా ఈ రోజు దేశ రాజధాని మహానగరం న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ అవార్డును అందుకోనున్నారు.
ఢిల్లీకి చెందిన చాణిక్య ట్రస్టు రాష్ట్రంలోని నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలల్లో చల్లా ధర్మారెడ్డిని ఎంపిక చేసింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం. ప్రజా సమస్యలను తీర్చడం..
అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో చిత్తశుద్ధి .. సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకు అందడంలో కీలక పాత్ర పోషించడంతో చల్లా ధర్మారెడ్డిని జాతీయ స్థాయిలో ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపిక చేసినట్లు సదరు సంస్థ ప్రకటించింది. అయితే దేశ వ్యాప్తంగా మొత్తం ముప్పై మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేసినట్లు తెలిపింది.