అక్కినేని నాగార్జున మన్మధుడు 2 ఫ్లాప్ తరువాత తాను నటించబోయే తరువాత చిత్రంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్ విషయానికి వచ్చేసరికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాడు. ఇలా మొత్తానికి ఒక యంగ్ డైరెక్టర్ కధ నాగ్ కి నచ్చింది. ఇక నాగార్జున చాలామంది యంగ్ డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులోని భాగంగానే ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ సోలోమన్ కధ నచ్చడంతో అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ డైరెక్టర్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివర్లో నాగ్ షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. ప్రస్తుతం నాగార్జున టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక మన్మధుడు దెబ్బ కోలుకోవాలంటే ఇది హిట్ కావాల్సిందే.
