తెలంగాణ రాష్ట్ర మంత్రి సీహెచ్ మల్లారెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జవహార్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులు ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలు ఎంతో సంబురంగా బతుకమ్మ వేడుకలను జరుపుకొవాలని బతుకమ్మ చీరెలను ఇస్తున్నారు..
రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని”ఆయన ఉద్ఘాటించారు.