వరుస ఫ్లాపుల తరువాత దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక్క సినిమాతో పైకి లేచాడు. రామ్ పోతినేని హీరోగా, నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లు గా తెరకెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రాన్ని పూరీ, ఛార్మి కలిసి నిర్మించారు. అయితే ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పూరీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని తెలుస్తుంది. ఇలా మంచి పేరు తెచ్చుకున్నడో లేదో మరో తప్పటడుగు వెయ్యడానికి సిద్దమవుతున్నాడని అందరు భావిస్తున్నారు. ఆ తప్పు ఏమిటంటే సైరా సినిమాకు ఎదురుగా వెళ్ళడమే. ఇక అసలు విషయానికి వస్తే పూరీ ఇస్మార్ట్ శంకర్ సినిమాను ఈ నెల 27న రీరిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అయితే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి చిత్రం విడుదల కానుంది. దీని ప్రభావం కచ్చితంగా పూరీ చిత్రం పై పడుతుంది. కాబట్టి వెనక్కి తగ్గడం మంచిదని అందరు భావిస్తున్నారు.
