నూనెలో వేయించనదే మీకు తినాలన్పించదా..?. అసలు నూనె లేకుండానే ఏది కూడా మీ నోట్లోకి పోదా..?. అయితే ఇది మీలాంటోళ్ల కోసమే. నూనెలో పదే పదే వేయించిన బజ్జీలు కానీ బోండాలు,సమోసాలు తింటే మీ పని ఖల్లాసే.
బాగా మరగబెట్టిన నూనెలోని పదార్థాలను ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానీకరమని నిపుణులు చెబుతున్నారు. మరగబెట్టిన నూనెలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానీకరం చేస్తాయి అని హెచ్చరిస్తున్నారు.
దీనివలన అధికరక్తపోటు,మధుమేహాం వచ్చే అవకాశముందని వారు చెబుతున్నారు. అంతేకాక ప్రమాదకర ఈ యాసిడ్స్ వల్ల క్యాన్సర్ ,పక్షవాతం కూడా వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. సో వాటికి దూరంగా ఉండటం బెటర్ కదా మరి..