రైతు బంధు, రైతు భీమా పథకాలు రైతులకు వరమని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న హరీష్ ..మాంద్యం పరిస్థితులు ఉన్న సంక్షేమం విషయంలో ఇబ్బంది లేకుండా బడ్జెట్ లో కేటాయింపులు చేశామని తెలిపారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం నిర్వహణలో సంగారెడ్డి జిల్లా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో 30 రోజుల ప్రణాళిక తో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. రైతు మరణించిన వారంలోగా బీమా అందించండి. ఏ కారణంతో మరణించారో సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులకు సూచించారు. సమగ్ర సమాచార సేకరణతో తగు చర్యలు చేపట్టి రైతు మరణాలు ఆపడం , వారిని కాపాడుకోవాల్సిన వాళ్ళం అవుతామని చెప్పారు. పల్లె నిద్ర అనే వినూత్న కార్యమానికి శ్రీకారం చుట్టి మెగా శ్రమదానం ద్వారా గ్రామాలలో పారిశుద్ధ్యం ఇతర కార్యక్రమాలు చురుకుగా పనులు కొనసాగుతున్నాయని…. ఈ సందర్భంగా అధికారులను అభినందించారు హరీష్.