తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకూ విజయ దశమి సందర్భంగా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మరియు ఇతర విద్య సంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9వరకూ దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ అసలు కధ ఇప్పుడే మొదలైంది. ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రభుత్వ విద్యాసంస్థలు నడుచుకుంటాయి. ఇక ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ విషయానికి వస్తే సెలవులు ఇచ్చినప్పటికీ యాజమాన్యం విద్యార్ధులపై వత్తిడి తెస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారిని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తాయి. ఇవి కాస్తా వరకు తగ్గినప్పటికీ ఇంకా పూర్తిగా ఆపగలిగితేనే స్టూడెంట్స్ కు ప్రశాంతత ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
