గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకోసం కృషి చేస్తున్నారు. ఈ మేరకు చాలా వరకు విజయవంతం చేసి అందరి మన్నలను అందుకున్నాడు. ఈ ప్రయత్నంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో వినీలం చెయ్యాలనే సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఇంఛార్జ్ కృష్ణబాబు మాట్లాడుతూ..ఉద్యోగులను విలీనం చేయడం వల్ల ఆర్టీసీకి రూ.3300 కోట్లు మిగులుతుందని చెప్పుకొచ్చారు. ఈమేరకు ఈ వినీల పక్రియ జనవరి 1 కల్లా పూర్తి అయ్యేటట్టుగా చూస్తామని అన్నారు. ఇంతకముందు చూసుకుంటే ఈ సంస్థకు నెలకు 100 కోట్లు వరకు నష్టం వచ్చిందని, 2015 నుండి డీజిల్, జీతాలు ఇంకా కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయింది.
ఈ ఒక్క కారణంతోనే ప్రభుత్వంలో వినీలం చెయ్యాలని అనుకున్నట్టు చెప్పారు. ఇప్పుడున్న బస్సులు వల్ల డీజిల్ కొరత, ఇంకా కొన్ని సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. దాంతో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలనే నిర్ణయం జగన్ తీసుకున్నట్టు చెప్పారు. ఇలా కిలోమీటర్ కు 10 వరకు మిగిలే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం కేంద్రం 350 బస్సులు రాష్ట్రానికి కేటాయించగా మరో 650ప్రైవేట్ బస్సులు తీసుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు. ఎలక్ట్రికల్ బస్సుల విషయానికి వస్తే..దీనిపై ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని తెలియజేసారు. ఇక వీటిని . లీజ్ పద్ధతిలో తీసుకుంటామని, ఈ మేరకు టెండర్స్ పెడతామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి దారులకు మాత్రమే ఇవి తిరుగుతాయని అన్నారు. ఈ సంవత్సరం 1000 బస్సులు తీసుకొని వాటి వాడకం బట్టి మిగతావి తీసుకుంటామని ఆయన అన్నారు.