తెలుగురాష్ట్రాల్లోనే అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యే, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి అరెస్టయ్యారు. జిల్లాజైలులో ఉన్న చింతమనేనిని పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈనెల 11వ తేదీన న్యాయమూర్తి విధించిన 14రోజుల రిమాండ్ బుధవారంతో ముగిసింది.
అయితే చింతమనేని బయటకు వస్తారని అంతా భావించారు. అయితే దీంతోపాటు చింతమనేనిపై ఉన్న మరో రెండు కేసుల్లోనూ పీటీ వారెంట్‌పై పోలీసులు ఆయనను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో చింతమనేని కోర్టు ఆవరణలోనూ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులను తీవ్రంగా దుర్భాషలాడారు.. ఈ ఘటనలో మరోసారి ఆయనపై కేసు నమోదు అయ్యింది. దీంతో మళ్లీ ఈ కేసుల్లో న్యాయమూర్తి.. చింతమనేనికి అక్టోబర్ 9వరకు, మరోకేసులో అక్టోబర్ 10వరకు రిమాండ్ విధించారు.