వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామవాలంటీర్లు, 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పూర్తిగా పారదర్శకంగా, ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా.. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి..ఫలితాలు విడుదల చేసింది. ప్రభుత్వం ఒకేసారి లక్ష 1.26 లక్షల ఉద్యోగాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఎల్లోమీడియా బాబు ఆదేశాల మేరకు రంగంలోకి దిగి..పేపర్ లీక్ అయిందంటూ… విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ సర్కార్ చెలగాటం ఆడుతుందంటూ అసత్య కథనాలు ప్రసారం చేస్తోంది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి చంద్రబాబు గట్టిగా స్ట్రోక్ ఇచ్చాడు. “ఏపీపిఎస్సీలోని టైపిస్టు పేపర్ లీక్ చేసిందని కిరసనాయిలు చీకట్లో బాణం వేసాడు. ఇప్పడేమో ఎస్కేయూ నుంచి లీకైందని కంపు చేస్తున్నాడు.ఒక్క కోచింగ్ సెంటర్ నుంచి 100మంది సెలక్టరయ్యారట.జిల్లాకు సరాసరిన 10వేల పోస్టులున్న సంగతి దాచిపెట్టాడు.ఇంకో నాలుగైదు స్టోరీలు అల్లేదాకా నిద్ర పోయేట్టు లేడు” అని అన్నారు.