Home / ANDHRAPRADESH / ఆ విషయంలో సుజనా చౌదరి మాటలు వింటే…చంద్రబాబు సిగ్గుతో తలదించుకుంటాడు..!

ఆ విషయంలో సుజనా చౌదరి మాటలు వింటే…చంద్రబాబు సిగ్గుతో తలదించుకుంటాడు..!

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అక్రమకట్టడాలపై సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కృష్ణానదీ కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం సమాయాత్తం అయింది. ఈ మేరకు కరకట్టపై ఉన్న చంద్రబాబు అక్రమ నివాసంతో సహా ఇంకా అనేక భవనాల కూల్చివేతకు సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు ఇంట్లో అక్రమంగా కట్టిన ప్రజావేదికను అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం అయింది. అయితే లింగమనేని గెస్ట్‌హౌస్‌లో తాను అద్దెకు ఉంటున్నానని…తన అద్దె ఇంటిని కూల్చివేసేందుకు ప్రభుత్వం కూల్చివేస్తోందంటూ..చంద్రబాబు రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ అక్రమ నివాసం కూల్చివేత అంశాన్ని టీడీపీ రాజకీయంగా మల్చుకుంటోంది. వైసీపీ ప్రభుత్వం కావాలనే తన అద్దె ఇంటిని కూల్చివేస్తుందంటూ చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నాడు. ఇక టీడీపీ నేతలు మా బాబుగారిని అమరావతిలో ఉండనివ్వకుండా ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తుందంటూ రచ్చ చేస్తున్నారు. చంద్రబాబుకు కావాల్సింది ఇదే..తన అద్దె ఇంటిని ప్రభుత్వం కూల్చివేయడాన్ని ఎంత రచ్చ చేయిస్తే..ప్రజల్లో అంత సింపతీ వస్తుందని బాబు భావిస్తున్నాడు..అందుకే అక్రమ నివాసం కూల్చివేతపై గగ్గోలు పెడుతున్నాడు.

కాగా లింగమనేని గెస్ట్ హౌస్‌ను ఖాళీ చేయకుండా..ఇలా మొండిగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై ఒకప్పటి ఆయన సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన సుజనాచౌదరి ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ నివాసం వివాదంపై స్పందించారు. నేను ఏదైనా ఒక అద్దె ఇంట్లో ఉంటే..ఆ ఇల్లు నిబంధనల ప్రకారం కట్టలేదని తెలిస్తే..అలాంటి ఇంట్లో ఉండను…అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కొంప అయినా చెల్లింది…ఇప్పుడు ప్రభుత్వం మారింది. అక్రమ కట్టడాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటోంది. నిబంధనల మేరకు చంద్రబాబు తాను ఉంటున్న అక్రమ నివాసాన్ని ఖాళీ చేయాలి.. దీనికి ఇంత చర్చ ఏంటని సుజనా ప్రశ్నించారు. తాను నివాసం ఉంటున్న ఇంటిని ప్రభుత్వం కూలగొడితే..దాన్ని రాజకీయం చేసి ప్రజల్లో సానుభూతి పొందాలని చంద్రబాబు చూస్తున్నాడంటూ..సుజనా తీవ్ర విమర్శలు చేశాడు. కేవలం సానుభూతి కోసమే చంద్రబాబు తాను ఉంటున్న అక్రమ నివాసాన్ని ఖాళీ చేయకుండా రాజకీయం చేస్తున్నాడంటూ సుజనా‌చౌదరి చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లకు షాకింగ్‌ గా మారాయి. బాబుగారికి అత్యంత ఆప్తుడైన సుజనా చౌదరి ఇలా అక్రమ నివాసం విషయంలో చంద్రబాబును తప్పుపట్టడం టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat