తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున మహారాష్ట్రలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగడానికి తమకు అనుమతినివ్వాలని నాందేడ్ జిల్లాకు చెందిన పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, పలువురు రైతులు ఇటీవల ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సమావేశమై తమ అభిప్రాయాన్ని తెలిపిన సంగతి విదితమే.
దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వారికి హామీచ్చారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని స్థానిక ఆ పార్టీ నేతలు,అభిమానులు,ప్రజలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ” తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి.
ఇక్కడ కూడా వాటిని అమలుచేస్తామనే ఎజెండాతో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిశాము. వారు త్వరలోనే తమ అభిప్రాయాన్ని తెలుపుతామని హామీచ్చారు. అందుకే పార్టీ ఆఫీసును ప్రారంభించామని”తెలిపారు.