ప్రముఖ తెలుగు సినిమా కమెడియన్ వేణు మాధవ్ ఈ రోజు బుధవారం మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల ఆరో తారీఖున కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చేరారు.
ఈ రోజు ఇంకా ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు అని వైద్యులు చెబుతున్నారు. వేణుమాధవ్ కొంతకాలంగా కాదు ఏకంగా రుద్రమదేవి తర్వాత ఆయన పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. అలా వేణు మాధవ్ మూవీలకు దూరమవ్వడానికి కారణం ఏమిటి..? .
ఆయన ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో ఒక ప్రముఖ వెబ్ మీడియా చానెల్ కిచ్చిన ఇంటర్వూలో చెప్పారు. ఆ ఇంటర్వూలో వేణు మాధవ్ మాట్లాడుతూ”ప్రస్తుతం సినిమాల్లో బూతు ఎక్కువగా ఉంది. అలా వచ్చిన సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోవడంతో దూరం అయ్యాను. కొంతమంది కావాలనే నన్ను దూరం పెట్టారు. అందుకే నేను సినిమాలకు దూరం అయ్యాను”అని చెబుతూ వచ్చారు వేణు మాధవ్.