అసదుద్దీన్ ఓవైసీ..ఈ పేరుకు ఇంట్రడక్షన్ తో పనిలేదు. ఎందుకంటే ఆ పేరు లో ఉన్న పవర్ అలాంటిది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ లో ఒక్కడు అనడంలో సందేహమే లేదు. తన స్పీచ్ మొదలైతే ఎవరైనా సైలెంట్ అవ్వాల్సిందే. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సోషల్ మీడియా పరంగా ఈ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే ఎంఐఎం అంటే తెలియని వారు ఉండరు. కాని వారి ఆలోచనలు యూత్ కు తెలియజెయ్యాలని ఈ నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న యాప్ ఏదైనా ఉంది అంటే అది టిక్ టాక్ అనే చెప్పాలి. దీంతో ఈ పార్టీ తమ సందేశాలను దీని ద్వారా అందరకు చేరవేయ్యలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
