స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే మొన్న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినప్పటినుండి మెగా ఫ్యాన్స్, సోషల్ మీడియా అందరు బన్నీనే టార్గెట్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ సైతం వచ్చిన్నప్పుడు, అల్లు అర్జున్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. పోనీ ఎక్కడైనా బయట ఉండి రాలేదు అనుకుంటే పర్లేదు గాని ఇంట్లో ఉండి కూడా రాలేదంటే ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య విబేధాలు వస్తున్నాయని అందుకే వారి ఈవెంట్స్ కు బన్నీ దూరంగా ఉంటున్నాడనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. మరి దీనిపై బన్నీ క్లారిటీ ఇస్తాదంటారా..? లేదా అదే నిజమని సైలెంట్ గా ఉంటాడో చూదాం..?
