తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ ఈ రోజు మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి విధితమే.
కాప్రా(మౌలాలి)లోని వేణు మాధవ్ నివాసానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేణు మాధవ్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” ఇండస్ట్రీలోకి వేణుమాధవ్ రాకముందే తమ్ముడు వేణు మాధవ్ నాకు బాగా పరిచయం..
ఇంత చిన్న వయస్సులోనే అతడు చనిపోవడం చాలా బాధాకరం అని అన్నారు. వేణు మాధవ్ ఆసుపత్రి బిల్లులను చెల్లించడమే కాకుండా అతని అంత్యక్రియలకు రూ. 2 లక్షలు సాయం ప్రకటించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.