ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు అనుకులంగా వార్తలు వండివారిచ్చే రెండు ప్రధాన పత్రికలు క్రమంగా తమ పాఠకులను కోల్పోతున్నాయా..సాక్షి పత్రికకు ఆదరణ పెరుగుతుందా..తాజాగా వెల్లడైన పత్రికల రీడర్షిప్లో వెల్లడైన విషయాలను చూస్తే నిజమే అనిపిస్తోంది. గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకు కమ్మగా వంతపాడుతూ…టీడీపీకి పచ్చపాతంగా వార్తలు రాస్తూ, ప్రత్యర్థులపై విషం చిమ్మే రెండు ప్రధాన పత్రికలకు కాలం చెల్లే సమయం దగ్గరలోనే ఉంది. ఒక పత్రిక మీడియా మొఘలుగా పేరుగాంచిన బాబుగారి రాజగురువుకు చెందినది అయితే..మరొక పత్రిక..చంద్రబాబుకు కొమ్ము కాస్తూ..అమ్మ జగనా అంటూ విషం ప్రతి నిత్యం ఏదో ఒక వంకతో వైసీపీపై దుష్ప్రచారం చేస్తూ..ఆరిపోయే పచ్చపార్టీ జ్యోతిని కాపాడాలని ప్రయాసపడుతున్న పత్రిక..ఈ రెండు పత్రికల ఆధిపత్యానికి సాక్షి ఎంట్రీతో గండిపడింది. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో నిత్యం తమ కుల ప్రభువుకు భజన చేస్తూ…ప్రత్యర్థి పత్రికలను, ఛానళ్లను ప్రసారం కానివ్వకుండా పన్నాగాలు పన్నిన ఈ రెండు మీడియాహౌస్ల పాపం ఇప్పుడు పండుతోంది. ముఖ్యంగా వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కులప్రభువు ఆదేశాలతో ఈ రెండు పత్రికలు విలువలను తుంగలో తొక్కుతూ..అడ్డగోలుగా పచ్చ కథనాలు వండివారుస్తూ…ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందనేలా ప్రచారం చేస్తున్నాయి. అయితే పాఠకులు విజ్ఞులు..గతంలోలాగా పచ్చపత్రికలు చంద్రబాబుమీద మమకారంతో పచ్చపాతంగా ఏది రాస్తే అదే నిజం అనే రోజులు పోయాయి. సోషల్ మీడియా యుగంలో ఏ వార్త నిజం..ఏ వార్త అబద్ధం అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోతున్నాయి. తత్ఫలితమే పచ్చ పత్రికలకు రీడర్షిప్ భారీగా తగ్గిపోతే.. సాక్షి పత్రికకు మాత్రం..రీడర్షిప్ భారీగా పెరిగింది. తాజాగా వెల్లడైన అధ్యయనం ప్రకారం తెలుగు పత్రికల రీడర్షిప్లో సాక్షి దూసుకుపోయింది. సాక్షిగా కొత్తగా నాలుగు లక్షల రీడర్స్ వచ్చి చేరగా…పచ్చ పత్రికలకు 12 లక్షల వరకు ఉన్న రీడర్స్ను కోల్పోవాల్సి వచ్చింది. దీన్ని బట్టి అడ్డగోలుగా విష కథనాలు ప్రచురిస్తే ప్రజలు నచ్చడం లేదని అర్థమవుతుంది. తెలుగు ప్రజలు ఎల్లోమీడియాను ఎంతగా చీదరించుకుంటున్నాయో..చెప్పేందుకు ఈ రీడర్షిప్ లెక్కలే ప్రదానం. ఇప్పటికైనా చంద్రబాబు అనుకుల వార్తలు తగ్గించి..కాస్త వాస్తవిక ధృక్పథంతో వార్తలు రాస్తే పచ్చమీడియా పరువు నిలబడుతుంది. లేకుంటే త్వరలోనే అవి ఉనికిని కోల్పోవడం ఖాయం.
