అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారప్.. సీటు ఇచ్చేస్తారా..? .1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సీటు ఇచ్చేస్తారా..? అని ఇలా కడుపు ఉబ్బ నవ్వించి ఫేమస్ అయిన కమెడియన్ వేణు మాధవ్. ఆయన ఈ రోజు బుధవారం మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే వేణు మాధవ్ ఈ నెల ఆరో తారీఖున కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చేరారు .
అంతకుముందు వేణు మాధవ్ లివర్ సంబంధిత సమస్యలతోనే కాకుండా మూత్రపిండాల వ్యాధితో సతమతవుతూ ఉండేవాడంట.దీనికి సంబంధించిన చికిత్స పొందుతుంటే .. అది కాస్తా కిడ్నీలకు సోకింది అంట. దాంతో గత కొంతకాలంగా వేణు మాధవ్ డయాలిసిస్ చేయించుకుంటుండేవారంట.
ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆరో తారీఖున ఆసుపత్రిలో చేరిన వేణుమాధవ్ ఆరోగ్యం వైద్యానికి సహాకరించకపోవడంతో ఈ రోజు మధ్యాహ్నాం మృతి చెందారు అని వైద్యులు చెబుతున్నారు. వేణు మాధవ్ మృతికి అసలు కారణం మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధినే అని తేల్చి చెప్పారు వైద్యులు అని వార్తలు వస్తున్నాయి.