ఏపీలో తూర్పు గోదావరి జిల్లాలోని దేవీ పట్నం మండలం మంటూరు-కచ్చులూరు మధ్య బోల్తా పడిన ఒక బోటు ప్రమాదంలో తెలంగాణ ,ఏపీలకు చెందిన పలువురు మృతి చెందడమే కాకుండా పదమూడు మంది మృతదేహాలు లభ్యం కాలేదు.
ఈ ప్రమాదంలో ఇరవై ఆరు మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ నేపథ్యంలో మరణించిన వారి కుటుంబాలకు టాలీవుడ్ స్టార్ హీరో,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కో కుటుంబానికి రూ ఐదు లక్షల చొప్పున చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారని వార్తలు చక్కర్లు కొట్టాయి.
అయితే దీనిపై ఎన్టీఆర్ సన్నిహితులు స్పందించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. బోటు ప్రమాదం లో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొకరికి ఐదు లక్షల చొప్పున సాయం చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కొంతమంది కావాలనే ఇలా ప్రచారం చేస్తున్నారు అని “వారు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారని ఆ కథనాల సారాంశం..