Home / TELANGANA / అదర్శ పురపాలికలుగా మేడ్చేల్ లోని పురపాలికలు.. కేటీఆర్

అదర్శ పురపాలికలుగా మేడ్చేల్ లోని పురపాలికలు.. కేటీఆర్

మేడ్చేల్ నియోజకవర్గ పరిధిలోని పురపాలికలను అదర్శ పురపాలికలుగా తీర్చిదిద్దాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి మల్లారెడ్డి విజ్జప్తి మేరకు మేడ్చేల్ నియోజకవర్గంలోని పది పురపాలికలపైన మసాబ్ ట్యాంకులోని మున్సిపల్ కాంప్లెక్స్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ పరిధిలోని ఫీర్జాదీగూడా, బొడుప్పల్, జవహార్ నగర్ కార్పోరేషన్లతోపాటు మిగిలిన ఏడు మున్సిపాలీటీల కమీషనర్లను పురపాలికల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పురపాలికను అదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నుంచి అవసరం అయిన సహాకారం అందిస్తామని మంత్రులు తెలిపారు. ప్రతి పురపాలికలో తీస్కోవాల్సిన చర్యలపైన మంత్రి కేటీఆర్ మార్గదర్శనం చేశారు. ప్రజలు ప్రధానంగా పురపాలికల నుంచి కనీస సేవలను కోరుకుంటున్నారని, అందుకే పారిశుద్ద్యం, పార్కుల అభివృద్ది, మొక్కల పెంపకం, తాగునీటి సరఫరా వంటి కనీసం సేవలను మరింత మెరుగ్గా అందించేందకు కమీషనర్లు ప్రయత్నం చేయాలన్నారు. ప్రతి పురపాలికలో పౌరసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, శ్మశాన వాటికల అభివృద్ది చేయడం(వైకుంఠధామాల ఏర్పాటు), లేఅవుట్లలో ఖాళీ స్ధలాల రక్షణ, సిసి కెమెరాల ఏర్పాటు, డంప్ యార్డు ల ఏర్పాటు, వేస్ట్ మేనేజ్ మెంట్ కార్యక్రమాలను చేపట్టాలని కమీషనర్లను అదేశించారు. మేడ్చేల్ అసెంబ్లీ పరిధిలోని బొడుప్పల్ ఒక అదర్శ మున్సిపాలీటీగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నదని, ఈమేరకు మిగిలిన పురపాలికలు ఇక్కడి కార్యక్రమాలపైన అధ్యయనం చేయాలన్నారు. ప్రతి కమీషనర్ తన పురపాలికను అదర్శ పురపాలికగా మార్చడాన్ని సవాలుగా తీసుకుని పనిచేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.
ప్రభుత్వం పురపాలికల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించే లక్ష్యంతో నూతన చట్టాన్ని తీసుకు వచ్చిందని, ఈ చట్టం ద్వారా ప్రజలకు కలిగే సౌకర్యాలు, అధికారుల భాద్యతపైన మరింత చైతన్యం తీసుకురావాలని కోరారు. ఈమేరకు ప్రతి పురపాలికలోని అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కమీషనర్లను అదేశించారు. ప్రతి పురపాలికలో ఈ అఫీస్ వినియోగాన్ని తప్పనిసరి చేయాలన్నారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి, జిల్లా కలెక్టర్ యంవి రెడ్డి, డిటిసిపి డైరెక్టర్ విధ్యాదర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat