తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో భేటి అయ్యిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు వీరితో పాటు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై ఇరువురూ చర్చించారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై జగన్, కేసీఆర్ లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.అయితే ఇక అసలు విషయానికి ఇరు రాష్ట్రాల మేలు కొరకు జరిగిన ఈ భేటీపై ఎల్లో మీడియా విషం కక్కింది.కేంద్ర ప్రభుత్వంపై ఇద్దరు ముఖ్యమంత్రులు అసంతృప్తిగా ఉన్నారంటూ ఎల్లో మీడియాలో కధనం ప్రచురితమైంది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఎల్లో మీడియాకు చుక్కలు చూపించాడు.”సుహృద్భావ వాతావరణంలో ఇద్దరు సీఎంలు కూర్చుని నదీ జలాల వినియోగం, విభజన అంశాలపై మాట్లాడితే ఎల్లో మీడియా విషం కక్కింది. కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా “సీఎంల అసంతృప్తి” అంటూ క్రూరత్వాన్ని బయట పెట్టుకున్నాయి. చంద్రబాబు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు మీడియా బానిసలు అంటూ ధ్వజమెత్తాడు.
సుహృద్భావ వాతావరణంలో ఇద్దరు సిఎంలు కూర్చుని నదీ జలాల వినియోగం, విభజన అంశాలపై మాట్లాడితే ఎల్లో మీడియా విషం కక్కింది. కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా “సిఎంల అసంతృప్తి” అంటూ క్రూరత్వాన్ని బయట పెట్టుకున్నాయి. @ncbn కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు మీడియా బానిసలు. @AndhraPradeshCM
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 25, 2019