ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ అగ్రగామి థాంప్సన్ టీవీ కోసం భారతదేశంలో ప్రత్యేకంగా లైసెన్సింగ్ హక్కులు పొందిన ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారీ రాయితీలను తమ అత్యుత్తమ విక్రయాలు కలిగిన టీవీలపై ప్రకటించింది. వీటిలో ఫ్రెంచ్ బ్రాండ్ యొక్క తాజా శ్రేణి అధికారిక ఆండ్రాయిడ్ 4కె టీవీలు సైతం ఉన్నాయి.
ఈ రాయితీలు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలు జరిగే 5 రోజులూ అందుబాటులో ఉంటాయి. 24 అంగుళాల హెచ్డీ ఎల్ఈడీ టెలివిజన్ అతి తక్కువగా 5999 రూపాయలకు లభిస్తుంది. థాంప్సన్ టీవీ యొక్క తాజా మోడల్ అయినటు వంటి అధికారిక ఆండ్రాయిడ్ టీవీ 4కె శ్రేణి 26,999 రూపాయలకు 43 అంగుళాలు, 65 అంగుళాల టీవీ 55,999 రూపాయలకు లభిస్తుంది. ఈ సంవత్సరం థాంప్సన్ టీవీ అపూర్వమైన అమ్మకాలను నమోదు చేస్తుంది. ఆన్లైన్ విభాగంలో అత్యధిక అమ్మకాలు కలిగిన టీవీగా ఇది ఇప్పుడు గుర్తింపు పొందింది.
ఈ సందర్భంగా అవ్నీత్ సింగ్ మార్వా, సీఈవో, ఎస్పీపీఎల్ – భారతదేశంలో థాంప్సన్ టీవీలకు ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ లైసెన్సీ మాట్లాడుతూ “థాంప్సన్ టీవీ ఇప్పుడు ఆన్లైన్లో విక్రయించబడుతున్న రెండవ అతిపెద్ద బ్రాండ్‌గా నిలిచిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అందుబాటు ధరలలోని టెలివిజన్ కంపెనీగా మేము పరిశోధన, అభివృద్ధిపై అధికంగా పెట్టుబడులు పెడుతున్నాం. మా తాజా ఆవిష్కరణ అధికారిక ఆండ్రాయిడ్ టీవీ శ్రేణి. ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులు 4.6 రేటింగ్ అందించారు. ఈ పండుగ సీజన్లో 5% మార్కెట్ వాటా సొంతం చేసుకోవాలని లక్ష్యంగా చేసుకున్నాం” అని అన్నారు.