లేడీ అమితాబ్ విజయశాంతి, 1990లో టాప్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోయిన్. తన నటనతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం కొన్నినాలకు ఆమెకు ఇలా ఎందుకు అనిపించిందో తెలియదు గాని రాజకీయాల్లో అడుగుపెట్టింది. మళ్ళీ ఇప్పుడు 13 సంవత్సరాల తరువాత సినిమాల్లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా వస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఇందులో విజయశాంతి ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ఇక ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అనిల్, దిల్ రాజు మరోసారి ముందుకు రానున్నారు. డైరెక్టర్ చేతిలో ఇప్పుడు రెండు చిత్రాలు ఉన్నాయి. హిందీ వెర్షన్ లో ఎఫ్2, తెలుగులో ఎఫ్3 తీయనున్నాడు. అయితే ఈ F3 చిత్రంలో విజయశాంతికి ముఖ్య పాత్ర ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. అయితే కొందరు సీనియర్ నటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టకుండా ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదంటూ సలహాలు ఇస్తున్నారని తెలుస్తుంది.