తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు కూడా భారీ వర్షం కురుస్తుంది. నిన్నటి నుండి జంట నగరాలైన హైదరాబాద్ ,సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుంది.
దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ”గ్రేటర్ హైదరాబాద్ లో మరో గంట సేపు భారీ వర్షం కురుస్తుంది.
రానున్న రెండు గంటలపాటు నగరవాసులు తమ నివాసాలు లేదా కార్యాలయాల నుండి బయటికి రావద్దు. భారీ వర్షాలలో ఏ విధమైన అసౌకర్యం కలగకుండాఉండేందుకు 13 డిజాస్టర్ రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేశాం. జిహెచ్ఎంసి జోనల్ డిప్యూటీ కమిషనర్ లు ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలి అని ఆయన అన్నారు..