మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం వాల్మీకి, ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. సినిమా రిలీజ్ అయ్యే ఒక్కరోజు ముందు చిత్ర యూనిట్ కు హై కోర్ట్ షాక్ ఇచ్చింది. దాంతో వాల్మీకి టైటిల్ కాస్తా “గద్దల కొండ గణేష్” గా మారింది. టైటిల్ మారినప్పటికీ సినిమా మాత్రం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్స్ఆఫీస్ ను అల్లాడిస్తుంది. ఇక సాలు విషయానికి వస్తే విజయానందంలో ఉన్న చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది.హీరో వరుణ్,దర్శకుడు హరీష్ శంకర్,నిర్మాతలు రామ్ ఆచంట,గోపిచంద్ ఆచంట గేట్ వే హోటల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ…విజయవాడతో నాకు మంచి అనుబంధం ఉంది.
బెజావాడ ప్రజలు సినిమాను బాగా ఆదరించారు.రాబోయే రోజుల్లో మరికొన్ని మంచి సినిమాల్లో నటించబోతున్నాని,వైవిధ్యమైన పాత్రల్లో నటించడం ఆనందంగా ఉందని అన్నారు. సినిమా విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక చిత్రం డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ వాల్మీకి సినిమాకు సెన్సార్ అనుమతి ఇచ్చినా కొందరు కావాలని ఆందోళన చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. సినిమాను ఎంటర్టైన్మెంట్లా చూడడం లేదు. ఇండస్ట్రీ నుంచి ఇటువంటి సమస్యల పరిష్కారానికి ఆలోచన చెయ్యాలని అభిప్రాయపడ్డాడు. ఈ చిత్రంలో వరుణ్ ను విభిన్న రీతిలో చూపించామని, అభిమానుల నుంచి మంచి ఆదరణ వచ్చింది.చివరి నిమిషంలో సినిమా పేరు మార్చాల్సి వచ్చింది.ఇప్పటికైనా ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కూడా సహకరించాలని అన్నారు.