వివాదాస్పద టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఏలూరు కోర్ట్ షాక్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కుని పోలీసుల కళ్లగప్పి పారిపోయిన చింతమనేని ఎట్టకేలకు ఈ నెల 11న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన ఏలూరు కోర్ట్ చింతమనేనికి 14 రోజుల రిమాండ్ విధించింది.దీంతో ఆయన్ని పోలీసులు ఏలూరు జైలుకు తరలించారు. కాగా రిమాండ్‌లో ఉండగానే చింతమనేనిపై మరో కేసు నమోదు అయింది. దుగ్గరాలలో తనను పట్టుకోవడానికి పోలీసులు వచ్చిన సందర్భంగా తన అనుచరులను ఉసిగొల్పి 5 గురు లేడీ కానిస్టేబుళ్లను గదిలో బంధించి వేధించాడు. ఆ 5 గురు లేడీ కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో కోర్ట్ మరోసారి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బెయిల్ కోసం ప్రయత్నించిన చింతమనేనికి ఏలూరు కోర్టులో చుక్కెదురు అయింది. ఆయనకు బెయిల్ నిరాకరిస్తూ…అక్టోబర్ 9 వరకు రిమాండ్ పొగిడిస్తూ.. కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. 2017లో ఒక స్థలం వివాదంలో వ్యక్తిని నిర్బంధించి, కులం పేరుతో దూషించిన ఘటనలో చింతమనేనిపై కేసు నమోదైంది. అంతే కాకుండా ఇటీవల పినకడిమి శివారులో ఎడ్లబళ్లపై ఇసుక తీసుకువెళుతున్న దళితులను అడ్డుకుని ,వారిని కులం పేరుతో దూషించారు. దళితుల ఫిర్యాదు మేరకు చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్నిఈ నెల 11న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇవాళ రిమాండ్ ముగియడంతో బెయిల్ కోసం చింతమనేని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే న్యాయస్థానం చింతమనేని బెయిల్ పిటీషన్‌ను తిరస్కరిస్తూ అక్టోబర్ 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. దీంతో బెయిల్‌పై బయటకు రావాలనున్న చింతమనేని ఆశలపై కోర్ట్ నీళ్లు చల్లింది.మళ్లీ మరో రెండువారాల పాటు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా చింతమనేనిపై మొత్తం 51 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులన్నీ వరుసగా విచారణకు రానున్న నేపథ్యంలో చింతమనేని ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మొత్తంగా చంద్రబాబు, లోకేష్‌ల అండతో దెందులూరులో అరాచకం సృష్టించిన చింతమనేని ఇప్పుడు చెరసాల నుంచి బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అందుకే అంటారు. చేసిన పాపం వూరకే పోదని..
