రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, వారి సంక్షేమానికి మరిన్ని కొత్తపథకాలకూ శ్రీకారం చుడతామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24గంటల నీటి సరఫరా వంట పథకాలతో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలోని పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో క్రాప్‌కాలనీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బుధవారం సచివాలయంలో తనను కలిసిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చౌదర్‌పల్లి క్రాప్‌కాలనీ రైతులతో ఆయన మాట్లాడారు. సాంప్రదాయ పంటల సాగుతో రైతులు నష్టపోతున్నారని అన్న మంత్రి నిరంజన్‌రెడ్డి గత ప్రభుత్వాలు రైతులకు అండగా నిలబడలేక పోయాయని అన్నారు. రైతుల కష్టానికి తగినఫలితం రావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని పేర్కొన్నారు. అందుకే క్రాప్‌కాలనీలను ప్రోత్సహించనున్నామని చెప్పారు. చౌదర్‌పల్లి క్రాప్‌కాలనీ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎన్టీఆర్ నగర్‌మార్కెట్‌లో ప్రత్యేకంగా వారికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.