మద్యనిషేధానికి తెలుగుదేశం పార్టీ అనుకులమే వ్యతిరేకమే స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఆపార్టీ నేతలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. గత తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో సహజ వనరులను సైతం మీరు దోచుకోలేదా అని అవంతి ప్రతిపక్ష టీడీపీని ప్రశ్నించారు.
రాష్ట్రమంత్రిగా ఉండి భూ కుంభకోణాలపై మీరే ఫిర్యాదు చేశారు కదా అంటూ గతంలో జరిగిన గంటా వ్యవహారంపై అయ్యన్నను నిలదీశారు. టీడీపీకి ప్రజలు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చినా బుద్ధి రాలేదని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ గేట్లు తెరిస్తే పార్టీలోకి వచ్చేందుకు 10మంది టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారంటూ అవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీచ రాజకీయాలకు తాము పాల్పడమని స్పష్టం చేశారు. అలాగే మద్య నిషేధంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న టీడీపీ, చంద్రబాబు మద్య నిషేధంపై తమ వైఖరి స్పష్టం చేయాలని కోరారు