దేశంలో చాలామంది ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఉంటారు. కానీ.. కొందరు మాత్రం సో.. స్పెషల్ అన్నట్లుగా ఉంటారు. కమిట్ మెంట్ తో పని చేయటం.. ఎంతటి ఒత్తిడికైనా తలొగ్గక.. రూల్ ప్రకారం పని చేసే అధికారులు చాలా కొద్దిమంది ఉంటారు. ముక్కుసూటిగా.. నిజాయితీకి నిలువెత్తు రూపంలా ఉంటే అలాంటి అధికారుల్లో తెలుగు ప్రాంతానికి చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిణి దాసరి సింధూరిపై బదిలీ వేటు పడింది. కర్నాటక భవన నిర్మాణ సంక్షేమ శాఖ నుంచి ఆమెను మరో శాఖకు బదిలీ చేస్తూ యడియూరప్ప ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింధూరిపై బదిలీ వేటు పడటం వరుసగా ఇది నాలుగో సారి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గని నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారిణిగా ఆమెకు మంచి పేరుంది. కర్నాటకలో ఆమెను ‘లేడీ సింగం’ అని కూడా పిలుచుకుంటుంటారు. యడియూరప్ప ప్రభుత్వం సెప్టెంబర్ 20న ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 24న ఆమెను పట్టు పరిశ్రమ శాఖకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎప్పటిలానే ఈ బదిలీ విషయాన్ని లైట్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మరి.. లేడీ సింగం అన్నాక రూల్స్ బ్రేక్ చేసినోళ్లకు చుక్కలు చూపించకుండా ఉంటుందా ఏంటి?