టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో స్కెచ్ వెయ్యడానికి సిద్దంగా ఉన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషయంలో ప్రభుత్వాన్ని ఇరికించడానికి మరో ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. కోడెల విషయంపై మానవ హక్కుల కమిషన్, కేంద్ర హోం మంత్రికి పిర్యాదు చెయ్యాలని బాబు స్కెచ్ వేస్తున్నారని సమాచారం. చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అందులో కోడెల ఆత్మహత్యపై చర్చించి ప్రభుత్వం వేదింపులే దీనికి ముఖ్య కారణమని, ఈ ప్రచారాన్ని హక్కుల కమిషన్ లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. అలా అయితే మరి మీరు కోడెలకు అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా తన మనోభావాలను దెబ్బతీశారు కదా దీనిపై కూడా పిర్యాదు చేస్తారా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు ?
