టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరొకరిని పంపించాలని బిగ్ బాస్ టీమ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. షో ఆఖరి ఘట్టానికి రావడంతో మరింత రసవత్తరంగా ఉండాలనే యోచనలో యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అడుగుపెడితే మరో జంట హౌస్ లో ఉంటుందనే వార్త భారీగా స్క్రోల్ అవుతుంది. ఇక ఆ వ్యక్తి ఎవరూ, జంట ఎవరూ అని ఆలోచిస్తున్నారా. అతను మరెవ్వరో కాదు యాంకర్ రవినే..పటాస్ షో లో శ్రీముఖి,రవి జంట కారణంగా ఇప్పుడు ఈ వార్తలు వస్తున్నాయి. మరి దీనికి రవి ఒప్పుకున్నాడా లేదా అనేది ఇంకా తెలియాలి.
