ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ షాపింగ్ హవానే నడుస్తుంది. వీటివల్ల బయటకు వెళ్లి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ లోనే షాపింగ్ చేసుకుంటున్నారు. దీనికి తోడు మల్లా జనాలు ఆకర్షితులు అయ్యేలా ఆఫర్స్ మరియు డిస్కౌంట్ లు కూడా ఇస్తారు. మామోలు రోజుల్లోనే ఇలా ఉంటే ఇక పండుగలు వస్తే ఇంకెలా ఉంటుందో చూసుకోండి. రానున్న రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. దాంతో మరిన్ని మంచి ఆఫర్స్ ఇవ్వాలని ఈ-కామార్స్ సంస్థలు నిర్ణయించుకున్నాయి. దాంతో దసరా పండుగ సందర్భంగా ప్రతీ వస్తువుపై 70 శాతం వరకు తగ్గించేలా ఆఫర్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. అంతేకాకుండా సుమారు లక్షా 40వేల ఉద్యోగాలు కు నోటిఫికేషన్ ఇచ్చాయి.ఇది పండుగ సీజన్ కావడంతో సేల్స్ ఎక్కువగా ఉంటాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అమెజాన్ 90,000 ఉద్యోగాలు, ఫ్లిప్ కార్ట్ 50,000 ఉద్యోగాలు తీయడం జరిగింది. ఇవి కాంట్రాక్టు జాబులని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పండుగ సీజన్ అయిపోతే ఎటువంటి సేల్స్ ఉండవు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.