Home / 18+ / జగన్ తీసుకుంటున్న మొండి నిర్ణయాలతో రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? ఇంకా ఏం జరగనుందో తెలుసా.?

జగన్ తీసుకుంటున్న మొండి నిర్ణయాలతో రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? ఇంకా ఏం జరగనుందో తెలుసా.?

పోలవరం ప్రధాన రీటెండర్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి 628 కోట్ల ఆదా వచ్చింది.గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధరకంటే తక్కువకే 12.6% అంటే రూ.4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ముందుకొచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి 628కోట్ల నిధుల ఆదా జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే రూ.4358 కోట్ల మొత్తానికి టెండర్ దాఖలు చేసింది. కోర్టు అనుమతులు లభించిన వెంటనే మేఘా పనులు ప్రారంభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌లో భాగంగా పోలవరం కాంట్రాక్టును రద్దు చేసి తిరిగి టెండర్‌ను పిలవడం దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయాంగా పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించారు. సీఎం జగన్ ఈ పనులను రద్దు చేసి రివర్స్ టెండర్కు వెళ్లి, పోలవరం హెడ్ క్వార్టర్స్ తో పాటు జల విద్యుత్ కేంద్రాల్ని కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది.ఆ పనులు విలువ రూ 4987 కోట్లు.

 

ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలనేది సర్కారు ఆదేశం. పోలవరం ప్రాజెక్టు హెడ్ వ‌ర్క్స్ నుంచి ఎడ‌మ కాలువ‌కు అనుసంధానం చేసే 65వ ప్యాకేజీ ప‌నుల‌కు రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్వ‌హించారు. దీనిద్వారా ప్రభుత్వం రూ. 58 కోట్ల రూపాయాలు ఆదా చేసింది. అలాగే మొత్తం ఆరు సంస్థ‌లు టెండ‌ర్లు దాఖ‌లు చేయ‌గా, అందులో ఎల్ 1 సంస్థ రూ.260.26 కోట్ల‌కు టెండ‌ర్ దాఖ‌లు చేసింది. రూ.274 కోట్ల విలువ చేసే ప‌నుల‌ను 6.1 శాతం త‌క్కువ‌కు పూర్తి చేయ‌డానికి అంగీక‌రించిన ఎల్ 1 క‌న్నా ఎవ‌రైనా త‌క్కువ‌కు చేస్తారా అంటూ రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్వ‌హించారు. దాంతో రూ.231.47 కోట్ల‌తో పూర్తి చేసేందుకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. ఇది అంచ‌నా విలువ క‌న్నా 15.66 శాతం త‌క్కువ. గ‌తంలో నిర్వ‌హించిన టెండ‌ర్‌తో పోలిస్తే ఈసారి రూ.58.53 కోట్ల ప్ర‌జాధ‌నం ఆదా చేసిన‌ట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. అయితే ప్ర‌భుత్వం రివ‌ర్స్ టెండ‌రింగ్ పేరుతో త‌మ‌కు కావాల్సినవారికి ప‌నులు అప్ప‌గించేందుకు ‘రిజ‌ర్వ్‌డ్ టెండ‌రింగ్’ అమ‌లు చేసింద‌ని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆరోపించారు. సాంకేతిక అర్హ‌త‌లు ప‌రిశీలించిన త‌ర్వాత టెండ‌ర్లు ఆహ్వానించాలి. కానీ, దానికి విరుద్ధంగా చేశారు. టెక్నిక‌ల్ బిడ్లు తెర‌వ‌కుండా ఫైనాన్సియ‌ల్ బిడ్లు తెర‌వ‌డం అనేది గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కూడా జ‌ర‌గ‌లేదంటున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల్ని, సాంకేతిక నిపుణుల‌ను కూడా సంప్ర‌దించ‌కుండా ఏక‌ప‌క్షంగా ఈ ప్ర‌క్రియ సాగిస్తున్నారని, కేంద్ర విజిలెన్స్ క‌మిష‌న్ నివేదిక‌ల‌ను తుంగ‌లో తొక్కారని చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా జగన్ తీసుకున్న మొండి నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి 628కోట్లు ఆదా అవడంతోపాటు మరింత మేలు జరగనుంది.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat