యావత్ ప్రపంచం గుర్తుపెట్టుకునే రోజు ఇదే అని చెప్పాలి ఎందుకంటే ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఐసీసీ మొట్టమొదటిసారి 2007 లో సౌతాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచ కప్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి మ్యాచ్ పాక్, భారత్ మధ్య ఎంతో రసవత్తరంగా జరగగా చివరికి ఇండియా గెలిచింది. అలా ఆరంభంలో విజయంతో మొదలుపెట్టిన భారత్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరకి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో పాక్ తో ధోని అద్భుతమైన కెప్టెన్సీ తో భారత్ విజయం సాధించింది. దీంతో టీ20 వరల్డ్ కప్ సాధించిన మొదటి జట్టుగా చరిత్రలో నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే ఆ ఆద్భుతం ఇదే రోజున 2007లో జరిగింది. నేటికి భారత్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. క్రికెట్ అభిమానులు ఎవరైనాసరే ఈరోజును మర్చిపోరు.
