టీమిండియా రన్నింగ్ మెషిన్, కెప్టెన్ విరాట్ కోహ్లి చిక్కుల్లో పడ్డాడు. ఏకంగా ఐసీసీనే అతడికి వార్నింగ్ ఇచ్చింది. ఇంకొక తప్పు చేస్తే నిషేధం తప్పదని తేల్చి చెప్పేసింది.ఇక అసలు విషయానికి వస్తే భారత్ సౌతాఫ్రికా తో మూడు టీ20 మ్యాచ్ లు ఆడగా అందులో ఒకటి వర్షం కారణంగా రద్దయింది. మిగతావాటిలో ఒకటి ఇండియా, ఇంకొక మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలుచుకుంది. అయితే మూడో మ్యాచ్ లో భాగంగా కోహ్లి బౌలర్ హెండ్రిక్స్ భుజాన్ని తట్టాడు. అది గమనించిన ఐసీసీ అతడికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏ ప్లేయర్ ఐన సరే నాలుగు అంతకన్నా ఎక్కువ వార్నింగ్ లు తీసుకుంటే అతడిని ఆట నుండి బహిష్కరిస్తారు. అయితే కోహ్లికి ఇదే మూడవది, అంతకముందు 2018లో సౌతాఫ్రికా తో జరిగిన టెస్ట్ లో మరియు ఈ మధ్యకాలంలో ఆఫ్ఘానిస్తాన్ తో కోహ్లి దొరికిపోయాడు. మరి ఈసారి అలా జరిగితే కష్టమే అని చెప్పాలి.