టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ,అందాల భామ సమంత ,అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే సమంత నాగ చైతన్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
ప్రముఖ నటి మంచు లక్ష్మీ హోస్ట్ గా ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే ఒక షో మొదలైన సంగతి తెలిసిందే. ఈ షో గురించి ఒక ఫ్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రోమోలో సమంత తన బెడ్ రూమ్ గురించి .. తన పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను చెప్పుకొచ్చింది.
అందులో భాగంగానే సమంత మాట్లాడుతూ “చైతూకు నాకంటే ముందు మొదటి వైఫ్ ఉంది. అది లేకుండా అసలు పడుకోడు. మా ఇద్దరి మధ్య అది ఖచ్చితంగా ఉంటుంది. అది ఏమిటో కాదు తలగడ(ఫిల్లో,దిండు)అని అమ్మడు షాకిచ్చింది. చైతూ మొదటి వైఫ్ ఫిల్లో అన్నమాట.